Jawan Movie Review : ముంబై – యంగ్, డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. పఠాన్ తర్వాత షారూక్ ఖాన్ కు గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు. ఆ చిత్రం రూ. 1,000 కోట్లు కొల్లగొట్టింది.
Jawan Movie Review Viral
జవాన్ ను అత్యంత జనరంజకంగా మల్చడంలో అట్లీ సక్సెస్ అయ్యాడని ఫ్యాన్స్ కితాబు ఇస్తున్నారు. ఇక సినిమాకు అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. బాద్ షా నటన, నయనతార అందం, దీపికా పదుకొనే స్పెషల్ అప్పియరెన్స్ దుమ్ము రేపింది. ఇక ప్రతి నాయకుడిగా విజయ్ సేతుపతి నటనకు వంద మార్కులు పడ్డాయి.
ఓవరాల్ గా జవాన్(Jawan Movie) మెగా బ్లాక్ బస్టర్ అంటున్నారు సినీ పండితులు. ఈ ఏడాది బాద్ షాకు సంతోషాన్ని కలిగించాయి రెండు సినిమాలు. ఒకటి పఠాన్ రెండోది ఇవాళ విడుదలైన జవాన్. మసాలా ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దడంలో అట్లీ కుమార్ సక్సెస్ అయ్యాడు. ఇక షారుక్ నటన పీక్ కు వెళ్లింది.
ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ అయితే జవాన్ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇది మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచి పోతుందని పేర్కొన్నాడు. రేటింగ్ 5 కు గాను 4 ఇచ్చాడు. ప్రేక్షకులను కట్టి పడేసే సన్నివేశాలు, మైమరిచి పోయేలా డ్యాన్సులు, పాటలు, హత్తుకునే డైలాగులు , ఆకర్షించే ఎపిసోడ్ లు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయని స్పష్టం చేశాడు.
Also Read : Lokesh Kanagaraj : జవాన్ టీంకు కంగ్రాట్స్ – లోకేష్