Jawan Movie : జ‌వాన్ వ‌సూళ్ల జైత్ర‌యాత్ర‌

రెండు రోజుల్లోనే రికార్డ్ బ్రేక్

Jawan Movie : అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్ ఖాన్ , న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకొనే, విజ‌య్ సేతుప‌తి న‌టించిన జ‌వాన్ దుమ్ము రేపుతోంది. కేవలం రెండు రోజుల్లో రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. తొలి రోజు రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన జ‌వాన్ రెండో రోజూ కూడా అదే రీతిలో ముందుకు సాగుతోంది.

Jawan Movie Collections Trending

వ‌సూళ్ల ప‌రంగా చూస్తే తొలి రోజు రూ. 125.05 కోట్లు సాధిస్తే 2వ రోజు రూ. 109.24 కోట్లు సాధించింది. మొత్తంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రెండు రోజుల‌లో రూ. 234 . 29 కోట్లు వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టికే షారుక్ ఖాన్ , దీపికా ప‌దుకొనేతో క‌లిసి న‌టించిన ప‌ఠాన్ రూ. 1,000 కోట్లు వ‌సూలు చేసింది.

ఆ చిత్రం ఇదే ఏడాది విడుద‌లైంది. వ‌ర‌ల్డ్ ను షేక్ చేసింది. ప్ర‌స్తుతం అట్లీ కొట్టిన దెబ్బ‌కు జ‌నం ఫిదా అయ్యారు జ‌వాన్(Jawan Movie) చిత్రం చూసి. జ‌వాన్ లో బాద్ షా షారుక్ ఖాన్ డ్యూయ‌ల్ రోల్ లో న‌టించారు. ఇక త‌మిళ అందాల తార న‌య‌న‌తార బాద్ షాకు పోటా పోటీగా న‌టించింది.

ఏదో ఒక సామాజిక అంశాన్ని పాయింట్ అవుట్ చేస్తూ సినిమాలు తీసే ద‌మ్మున్న డైరెక్ట‌ర్ గా అట్లీకి పేరుంది. గ‌తంలో జోసెఫ్ విజ‌య్ తో తీసిన విజిల్ (బిజిల్) లో మోదీ స‌ర్కార్ ను ప్ర‌శ్నించాడు. జీఎస్టీ వ‌ల్ల ఎవ‌రికి లాభ‌మ‌ని నిల‌దీశాడు. తాజాగా జ‌వాన్ లో ఓటు ఎంత ప‌విత్ర‌మైన‌దో, ఎంత విలువైన‌దో బాద్ షా పాత్ర‌తో చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు అట్లీ కుమార్.

Also Read : Adah Sharma : కేర‌ళ స్టోరీ న‌టికి బంప‌ర్ ఆఫ‌ర్

Comments (0)
Add Comment