Jawan Movie Record : జ‌వాన్ మూవీ రికార్డ్ బ్రేక్

వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 120 కోట్లు

Jawan Movie Record : ముంబై – నిన్న‌టి దాకా స్త‌బ్దుగా ఉన్న బాలీవుడ్ లో ఒక్క‌సారిగా ఆనందం వ్య‌క్తం అవుతోంది. భార‌తీయ సినిమా ఇప్పుడు కాసుల‌తో క‌ళ‌క‌ళ లాడుతోంది. ప్ర‌త్యేకించి బాద్ షా న‌టించిన జ‌వాన్ రికార్డుల మోత మోగిస్తోంది. త‌మిళంలో విడుద‌లైన నెల్స‌న్ దిలీప్ కుమార్ ర‌జ‌నీకాంత్ తో తీసిన జైల‌ర్ రూ. 600 కోట్లు కొల్ల‌గొట్టింది.

Jawan Movie Record Viral

ఇక ఇదే ఇండ‌స్ట్రీకి చెందిన క్రియేటివ్, డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ షారుక్ ఖాన్ , న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకొనే, విజ‌య్ సేతుప‌తి తో జ‌వాన్(Jawan Movie) ను తెర‌కెక్కించాడు. ఈ ఒక్క చిత్రానికి భారీ బ‌డ్జెట్ ను కేటాయించాడు షారుక్ ఖాన్. త‌న భార్య గౌరీ ఖాన్ తో రూ. 220 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశాడు.

ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా రెస్పాన్స్ వ‌చ్చింది. విడుద‌ల కంటే ముందే రూ. 350 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక తొలి రోజే చ‌రిత్ర సృష్టించింది జ‌వాన్. ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 120 కోట్లు సాధించింది. జ‌వాన్ దేశంలో ఒక‌ట‌వ రోజు రూ. 70 కోట్లు సాధించింది.

రూ. 100 కోట్ల‌కు పైగా ఓపెనింగ్ రోజు క‌లెక్ష‌న్లు సాధించిన ఏకైక న‌టుడిగా షారుక్ ఖాన్ చ‌రిత్ర సృష్టించాడు.
ఇక సినిమాల ప‌రంగా చూస్తే తొలి రోజున ప‌ఠాన్ రూ. 57 కోట్లు, కేజీఎఫ్ -2 రూ. 53.95 కోట్లు , యుద్దం రూ. 53.35 కోట్లు, బాహుబ‌లి-2 రూ. 41 కోట్లు, ప్రేమ్ రత‌న్ ధ‌న్ పాయో రూ. 40.35 కోట్లు, గ‌ద‌ర్ -2 రూ. 40.10 కోట్లు వ‌సూలు చేశాయి. వీట‌న్నింటిని కాద‌ని జ‌వాన్ రూ. 100 కోట్లు దాటింది.

Also Read : Jawan Movie : షారుక్ మూవీ క‌లెక్ష‌న్ల సునామీ

Comments (0)
Add Comment