Jawan Movie : బాద్ షా క్రేజ్ జ‌వాన్ జోష్

విడుద‌ల కాకుండానే రికార్డ్

Jawan Movie : యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుబ్ బాద్ షా షారుక్ ఖాన్ , న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టిస్తున్న జైల‌ర్ చిత్రం విడుద‌ల కానుంది. సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని మూవీ మేక‌ర్స్ నిర్ణ‌యించారు.

Jawan Movie Will be Released on September 2023

ప్రి రిలీజ్ వేడుక‌లకు చెన్నై సిద్దం అవుతోంది. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా ఘ‌నంగా పూర్తి చేశారు. దిగ్గ‌జ న‌టుడు షారుక్ ఖాన్ భార్య జ‌వాన్ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేశారు ఈ సినిమా కోసం. మ‌రింత రిచ్ గా వ‌చ్చేలా చేశాడు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్.

టేకింగ్ లోనూ మేకింగ్ లోనూ టాప్ లో కొన‌సాగుతున్న ద‌ర్శ‌కుల‌లో ఒక‌డు అట్లీ. జోసెఫ్ విజ‌య్ తో తీసిన బిజిల్ దుమ్ము రేపింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌వాన్(Jawan Movie) కోసం రూ. 200 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు టాక్. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కానీ రిలీజ్ కానీ కాలేదు. అలా కాకుండానే ద‌ర్శ‌కుడి టాలెంట్, షారుక్ ఖాన్ బ్రాండ్ టోట‌ల్ గా రూ. 350 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది.

యాక్ష‌న్ , కామెడీ, రొమాన్స్ , క్రైమ్ నేప‌థ్యంగా సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్. అంతే కాదు అనిరుధ్ రవిచంద‌ర్ అందించిన సంగీతానికి ఫ్యాన్స్ కెవ్వు కేక అంటున్నారు. మొత్తంగా ప‌ఠాన్ త‌ర్వాత బాద్ షా వ‌స్తున్న ఈ ఫిలిం ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Also Read : Jailer Record : త‌మిళ నాట జైల‌ర్ రికార్డ్

Comments (0)
Add Comment