Jawan Movie Audio : 30న జ‌వాన్ ఆడియో లాంచ్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Jawan Movie Audio : త‌మిళ సినీ రంగానికి చెందిన యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే భారీ ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, సాంగ్స్ టాప్ లో కొన‌సాగుతున్నాయి. ప్ర‌త్యేకించి న‌య‌న తార‌తో బాద్ షా కింగ్ షారుక్ ఖాన్ పండించిన రొమాన్స్ ఆనాటి కాజోల్ ను త‌ల‌పింప చేసింది.

Jawan Movie Audio Launch on 30th August

ఇక టేకింగ్ లో , మేకింగ్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ షారుక్ ఖాన్ ను డిఫ‌రెంట్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. బాద్ షాతో పాటు న‌య‌న‌తార‌, స్పెష‌ల్ సాంగ్ లో అందాల ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే కూడా క‌నిపించ‌నుంది ఈ చిత్రంలో.

ఇక తాజాగా మూవీ మేక‌ర్స్ కీల‌క‌మైన అప్ డేట్ ఇచ్చారు జ‌వాన్(Jawan) చిత్రం గురించి. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ అందించారు అనిరుధ్ ర‌విచంద‌ర్. పాట‌లు బిగ్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులో భాగంగా భారీ ఎత్తున జ‌వాన్ మూవీ ఆడియో లాంచ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు గాను డేట్ కూడా క‌న్ ఫ‌ర్మ్ చేశారు.

చెన్నై వేదిక‌గా ఆగ‌స్టు 30న జ‌వాన్ ఆడియో లాంచ్ ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా అట్లీ తీసిన జ‌వాన్ తమిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో రిలీజ్ కానుంది. రూ . 200 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి సినిమా తీస్తే ఇప్ప‌టికే రూ. 300 కోట్లు రిలీజ్ కాకుండా వ‌చ్చిన‌ట్లు టాక్.

Also Read : King Of Kotha : కింగ్ ఆఫ్ కొత్త‌పై దుల్క‌ర్ ఆశ

jawan movie audio luanch on 30th august
Comments (0)
Add Comment