Jawan Movie : జ‌వాన్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్

షారుక్ ఖాన్ మూవీకి హెవీ డిమాండ్

Jawan Movie : అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shah Rukh Khan) , న‌య‌న తార న‌టించిన జ‌వాన్ సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

Jawan Movie Viral

ఒక్కో టికెట్ ధ‌ర ఏకంగా రూ. 2,500కు పైగా ప‌లుకుతోంది. భారీ ధ‌ర‌కు విక్ర‌యించ‌డంపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌రాగా చేసుకుని మూవీ మేక‌ర్స్ త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ వాపోతున్నారు.

జ‌వాన్ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో వ‌స్తోంది. ఇక విజ‌య్ సేతుప‌తి ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన జ‌వాన్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. హీరోయిన్ గా న‌య‌న‌తార‌తో పాటు దీపికా ప‌దుకొనే న‌టించారు.

దుబాయ్ లోని బుర్జు ఖ‌లీఫా వ‌ద్ద జ‌వాన్ ట్రైల‌ర్ ప్ర‌త్యేకంగా రిలీజ్ చేశారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ అస్సెట్ గా మారింది. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రూ. 200 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి నిర్మించారు. ఇంకా సినిమా విడుద‌ల కాకుండానే రూ. 350 కోట్లు కొల్ల‌గొట్టింది జ‌వాన్.

Also Read : Bedurulanka 2012 : బెదురులంక 2012 మూవీ సూప‌ర్

Comments (0)
Add Comment