Jawan Advance : జ‌వాన్ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్

బాద్ షా షారుక్ ఖాన్..న‌య‌న‌తార

Jawan Advance : డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్ ఖాన్ , న‌య‌న‌తార న‌టించిన జ‌వాన్ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే త‌ను న‌టించిన ప‌ఠాన్ రూ. 1,000 కోట్ల మార్క్ ను దాటేసింది. తాజాగా తాను న‌టించిన జ‌వాన్ కూడా భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొన‌డంతో కింగ్ బాద్ షా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Jawan Advance Bookings

త‌న భార్య నిర్మాణ సార‌థ్యంలో షారుక్ ఖాన్ ఇందులో న‌టిస్తుండ‌డం విశేషం. ప్ర‌త్యేకించి ప్ర‌తి నాయ‌కుడిగా త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టించ‌డం ఇందులో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ఇక దీపికా ప‌దుకొనే అతిథి పాత్ర‌తో పాటు పాట‌లో కూడా న‌టిస్తుండ‌డం స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారింది. ఇప్ప‌టికే విడుద‌ల కాకుండానే పెట్టిన డ‌బ్బుల‌న్నీ వ‌చ్చిన‌ట్లు టాక్.

జ‌వాన్(Jawan) చిత్రాన్ని భారీ ఖ‌ర్చు తో తీశాడు డైరెక్ట‌ర్. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు క‌నీసం రూ. 200 కోట్ల‌కు పైగానే ఈ సినిమా కోసం ఖ‌ర్చు పెట్టించిన‌ట్లు టాక్. అయినా ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఇదే స‌మ‌యంలో సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్లు, పాటలు నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నాయి.

ఇటీవ‌లే విడుద‌ల చేసిన ల‌వ్, రొమాంటిక్ సాంగ్ ట్రెండింగ్ లో కొన‌సాగింది. ఇక ముంద‌స్తు అడ్వాన్స్ బుకింగ్ లో యుఎస్ లో రికార్డుల మోత మోగిస్తోంది జ‌వాన్. ముందస్తు అమ్మ‌కాలు రూ. 1,51,187 డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం విశేషం. మొత్తం అమెరికా లోని 367 థియేట‌ర్ల‌లో 1607 ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 9,691 టికెట్లు అమ్ముడు పోవ‌డం ఓ రికార్డు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Rakhi Sawant : నా వీడియోలు అమ్ముకున్నాడు

jawan movie shahrukh khan nayanatara advance bookings usa
Comments (0)
Add Comment