Jawan Advance Booking : జ‌వాన్ టికెట్లకు భారీ డిమాండ్

రూ. 9.01 కోట్లు వ‌సూలు

Jawan Advance Booking : క్రియేటివ్ యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ చిత్రం సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆశించిన దానికంటే భారీ ఎత్తున టికెట్లు అమ్ముడు పోయాయి. ముంద‌స్తుగానే రూ. 9 కోట్ల‌కు పైగానే వ‌సూలు కావ‌డం విశేషం.

Jawan Advance Booking Viral

బాలీవుడ్ స్టార్ న‌టుడు షారుక్ ఖాన్ , త‌మిళ ముద్దుగుమ్మ న‌య‌న‌తార‌, ల‌వ్లీ బ్యూటీ దీపికా ప‌దుకొనే తో పాటు ప్ర‌తి నాయ‌కుడిగా విజ‌య్ సేతుప‌తి న‌టించారు జ‌వాన్ లో. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్ , సాంగ్స్ కు భారీ ఎత్తున స్పంద‌న ల‌భించింది.

షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రూ. 200 కోట్లు ఖ‌ర్చు చేసి జ‌వాన్ ను నిర్మించారు. విచిత్రం ఏమిటంటే చిత్రం విడుద‌ల కంటే ముందే రూ. 350 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించి 5,17,700 టికెట్లు అమ్ముడు పోయాయి. ఢిల్లీలో 39 వేల 535 టికెట్లు విక్ర‌యించారు.

దీని ద్వారా రూ.1.91 కోట్లు వ‌సూల‌య్యాయి. ముంబైలో 39 వేల 600 టికెట్లతో రూ. 1.57 కోట్లు, బెంగ‌ళూరులో 39 వేల 325 టికెట్ల ద్వారా రూ. 1.42 కోట్లు, హైద‌రాబాద్ లో 58 వేల 898 టికెట్లు అమ్మ‌కం ద్వారా రూ. 1.35 కోట్లు , కోల్ క‌తాలో 40 వేల 35 టికెట్లు అమ్మ‌గా రూ. 1.15 కోట్లు వ‌సూల‌య్యాయి.

Also Read : Devara Movie : శ‌ర‌వేగంగా దేవ‌ర షూటింగ్

Comments (0)
Add Comment