Javed Ali Tu Meri Roja : ‘అలీ’ మేరీ రోజా సాంగ్ వైర‌ల్

ఖుషీ సాంగ్ సింప్లీ సూప‌ర్
Javed Ali Tu Meri Roja :  ‘అలీ’ మేరీ రోజా సాంగ్ వైర‌ల్

Javed Ali Tu Meri Roja : శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఖుషీ మూవీ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల పంట పండిస్తోంది. భార‌త్ తో పాటు ఓవ‌ర్సీస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. సినిమాపై, న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ పై ఎన్ని వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసినా వాట‌న్నింటిని దాటుకుని రికార్డు బ్రేక్ చేసింది ఖుషీ.

Javed Ali Tu Meri Roja Song Viral

ప్ర‌త్యేకించి మ‌ల‌యాళ సినీ రంగానికి చెందిన సంగీత ద‌ర్శ‌కుడు హేష‌మ్ అబ్దుల్ వాహాబ్ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఖుషీ మూవీని తెలుగు, త‌మిళం, హిందీ, త‌దిత‌ర భాష‌ల్లో కూడా విడుద‌ల చేశారు.

అన్ని భాష‌ల్లో విడుద‌లైన పాట‌లు టాప్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి. తెలుగులో నా రోజా నువ్వేలా అంటూ శివ నిర్వాణ రాసిన పాట సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. దీనిని సంగీత ద‌ర్శ‌కుడు వాహాబ్ గుండెల్ని పిండేలా పాడాడు.

ఇక హిందీలో ఇదే సాంగ్ ను తు మేరీ రోజా పేరుతో రిలీజ్ చేశారు. దీనిని ప్ర‌ముఖ సింగ‌ర్ జావెద్ అలీ(Javed Ali) పాడాడు. ఇది హిందీలో నెంబ‌ర్ 1గా నిలిచింది. ఇప్ప‌టికే ప‌లు భాష‌ల్లో పాడిన అనుభ‌వం అలీకి ఉంది. తాజాగా ఈ సాంగ్ వైర‌ల్ గా మారింది.

తెలుగులో డైరెక్ట‌ర్ శివ నిర్వాణ పాట రాస్తే హిందీలో ర‌కీబ్ ఆలం రాశారు. దీనిని అద్భుతంగా ఆలాపించారు జావెద్ అలీ. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో స‌క్సెస్ మీట్ నిర్వ‌హిస్తోంది మైత్రీ మూవీ మేక‌ర్స్. స్టేజ్ ప‌ర్ ఫార్మెన్స్ లో సైతం జావెద్ అలీ త‌న గాత్రంతో అల‌రించాడు.

Also Read : Varisu Distributor : దిల్ రాజుతో డ‌బ్బులు ఇప్పించండి

Comments (0)
Add Comment