Jani Master : డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలపై స్పందించిన ‘జానీ మాస్టర్’

టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు...

Jani Master : తనని కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుండి తొలగించినట్లుగా వస్తున్న వార్తలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివరణ ఇచ్చారు. ఆ వార్తలలో నిజం లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అయితే సోమవారం ఉదయం నుండి జానీ మాస్టర్‌(Jani Master) సంబంధించి వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. తెలుగు ఫిల్మ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌‌కు జానీ మాస్టర్(Jani Master) అధ్యక్షుడిగా ఉండగా.. జానీ మాస్టర్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆదివారం ఈ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. తను అధ్యక్షుడిగా ఉన్న అసోసియేషన్‌కు తనకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించడంపై జానీ మాస్టర్ చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా ఈ వీడియోలో జానీ మాస్టర్ తెలిపారు.

Jani Master Tweet

‘‘మార్నింగ్ నుండి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతున్నారు. ఈ సందర్భంగా నాకు సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజమైన న్యూస్ ఏంటో తెలుసుకుని ప్రచారం చేయండి.. లేనిపోని రాతలు రాస్తే దానివల్ల ఎంతోమంది బాధపడతారు. నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్లు రాశారు. అందులో నిజం లేదు.

టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. ఇండస్ట్రీలో నేను ఏ యూనియన్‌లో అయినా పనిచేయవచ్చు. నేను చాలా మంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్‌కి అవకాశం ఇచ్చాను. అందులో ఈ రోజు చాలా మంది కొరియోగ్రాఫర్స్‌గా చేస్తున్నారు. త్వరలో ఇంకొందరు వస్తారు. ఏదిఏమైనా నాకు గుర్తింపునిచ్చింది మాత్రం ఈ యూనియనే. నేను ఈ రోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా ఉన్నానంటే ఈ యూనియనే కారణం. కాబట్టి యూనియన్ అంటే నాకెప్పుడు గౌరవం ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్‌పై నేను తీసుకునే చర్యలు తొందరలోనే చెబుతున్నారు. అంతవరకు ఎలాంటి వార్తలు రాయవద్దు. సపోర్ట్‌గా నిలిచిన అందరికీ మరొక్కసారి థ్యాంక్యూ. ‘గేమ్ చేంజర్’ మూవీలో నా కొరియోగ్రఫీలో చేసిన ఓ మంచి పాట త్వరలోనే రాబోతుంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read : Malaika Arora : మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో పడ్డ ‘మలైకా’

CommentsJani MasterTweetViral
Comments (0)
Add Comment