Jani Master Release : జైలు నాకు చాలా జీవితాన్నే నేర్పించింది

కాగా సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

Jani Master : చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్.. సెప్టెంబర్ 19 న అరెస్ట్ అయినా జానీ మాస్టర్. 36 రోజుల పాటు చంచల్ గూడా జైల్లో ఉన్న జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు చేసిన కమిటీ. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్(Jani Master) గత కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసునమోదైన విషయం తెలిసిందే.

కాగా సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అసిస్టెంట్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో జానీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉంటున్నారు. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. మొదట అవార్డు వచ్చిన కారణంగా రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిలు జానీ మాస్టర్ కు మంజూరు చేసింది. కానీ లైంగిక ఆరోపణలకు వేసుకోవడంతో అవార్డును రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో జానీ మాస్టర్ కు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

Jani Master Release..

దీంతో జానీ మాస్టర్ రంగారెడ్డి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సుదీర్ఘ వాదన తర్వాత జానీ మాస్టర్ వేసిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ జానీ మాస్టర్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన తర్వాత జానీ మాస్టర్ కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది.

Also Read : Actress Pragathi : తనపై కూడా ఆ రాజు అతను అసభ్యంగా ప్రవర్తించాడంటున్న ప్రగతి

Jani MasterPolice CaseUpdatesViral
Comments (0)
Add Comment