Jani Master : రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ ను కస్టడీకి అనుమతించిన కోర్టు

రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ ను కస్టడీకి అనుమతించిన కోర్టు..

Jani Master : నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం రిమాంగ్‌లో ఉన్న ఆయ‌న‌ను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ.. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు ఈ రోజు జానీ మాస్టర్‌ను తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించ‌నున్నారు.

Jani Master Case..

జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల నేప‌థ్యంలో స‌ద‌రు బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోక్సో కేసు నమోదు చేశారు. ఆపై గోవాలో ఉన్న‌ జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. తాజాగా రంగారెడ్డి కోర్టు జానీ మాస్ట‌ర్‌ను క‌స్ట‌డికి అనుమ‌తించ‌డంతో బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో నార్సింగి పోలీసులు జానీ మాస్ట‌ర్‌ ను విచారించనున్నారు.

Also Read : Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయి కేసులో వెలుగులోకి కీలక అంశాలు

Jani MasterPolice CaseUpdatesViral
Comments (0)
Add Comment