Janhvi Kapoor : ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

జాన్వీ వెంట ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా ఉన్నాడు...

Janhvi Kapoor : దివంగత అందాల తార శ్రీదేవి గారాల పట్టి, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌కు దైవ భక్తి ఎక్కువే. షూటింగుల నుంచి కాస్త విరామం దొరికితే చాలు తిరుమలలో వాలిపోతుంది. ఇక శ్రీదేవి పుట్టిన రోజు, వర్ధంతి, సినిమా రిలీజులు, పండగలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందీ అందా తార. తాజాగా మరోసారి తిరుమల వెంకన్నను దర్శించుకుంది జాన్వీ. కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం స్వామి వారి సేవలో పాల్గొంది.

Janhvi Kapoor Visited Tirumala..

జాన్వీ వెంట ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా ఉన్నాడు. తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జూనియర్ శ్రీదేవి. ఇందులో తిరుమల లడ్డూను తింటున్న ఫొటో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Also Read : Rithu Chowdary : ఓ భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కున్న జబర్దస్త్ నటి

Janhvi KapoorTirumalaTrendingUpdatesViral
Comments (0)
Add Comment