Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ, టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురువారం అస్వస్థతకు గురైంది. దీనితో ఆమె ప్రస్తుతం ముంబయ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే అమె తీసుకున్న ఆహారం కల్తీ అవడంతో అనారోగ్యానికి గురైందని… ప్రస్తుతం జాన్వీ ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు సన్నిహితులు, తండ్రి బోనీ కపూర్ తెలిపారు. అయితే గత వారం రోజులుగా అంబాని ఇంట జరిగిన వివాహ వేడుకల్లో జాన్వీ కపూర్ పాల్గొనడమే కాక ఉత్సాహంగా ఆడి పాడి ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ కావడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తుంది.
Janhvi Kapoor Health Update
ఇదిలాఉండగా ప్రస్తుతం హిందీతో పాటు తెలుగులోనూ వరుస చిత్రాలతో మంచి జోరుమీదుంది జాన్వీ కపూర్(Janhvi Kapoor). ఇప్పటికే తెలుగులో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలలో నటిస్తోండగా నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రం కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం విడుదలై మంచి విజయం సాధించగా మరో సినిమా ‘ఉలఝ్’ ఆగస్టు 2న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న సన్నీ సంస్కారి అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది.
Also Read : Mechanic Rocky: దీపావళికి వస్తోన్న విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ !