Janhvi Kapoor-NTR : ఎన్టీఆర్ ఎనర్జీ చూస్తే నాకు రెట్టింపు ఉత్సాహం పెరిగింది

సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది...

Janhvi Kapoor : బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. హిందీలో ఆమె నటించిన ‘ఉలజ్’ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, విక్కీ కౌశల్‌ వీరిలో ఎవరితో డ్యాన్స్‌ చేయాలని ఉందని అడగ్గా.. తనకు ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌ చేయాలనుందని మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె తారక్‌తో కలిసి ‘దేవర’లో నటిస్తున్నాను. ఎన్టీఆర్‌తో కలిసి ఓ పాట షూటింగ్‌ పూర్తయింది. ” తారక్‌తో కలిసి ఓ పాటకు స్టెప్పులేశా. అతని డాన్స్ లో ఈజ్‌ బావుంది. ఎనర్జీటిక్‌ హీరో. అతని సపోర్ట్‌తో నేను కూడా అలవోకగా డాన్స్ చేశాను. అమ్మ మంచి డాన్సర్‌. నాకు కూడా డాన్స్ అంటే ఇష్టం. తారక్‌తో కలిసి స్టెప్పులేశాక మరింత ఉత్సాహం పెరిగింది. ఇప్పుడు రెండో పాట చిత్రీకరణ కోసం, ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ఆతురతగా చూస్తున్నా’’ అని జాన్వీకపూర్‌(Janhvi Kapoor) చెప్పారు.

Janhvi Kapoor Comments Viral

సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది. పాన్‌ ఇండియా స్థ్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఊరమాస్‌ అవతారంలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు, సినీ ప్రియులు ఎంతగా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. కీలక పాత్రలో శ్రీకాంత్‌లో నటిస్తున్నారు. శివ కొరటాల రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read : Movie Taxes : టికెట్ కొనుగోలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు పై పన్ను విధించిన ఆ రాష్ట్ర సర్కార్

CommentsJanhvi KapoorJr NTRTrendingUpdatesViral
Comments (0)
Add Comment