Janhvi Kapoor : వరుస సౌత్ సినిమాలతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్

ఈ రెండు చిత్రాలే కాకుండా జాన్వీ మరో దక్షిణాది హీరోతో కలిసి నటించనుంది

Janhvi Kapoor : బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ప్రస్తుతం తెలుగు తెరపై ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జోడిగా కనిపించనుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాతో పాటు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్‌లో కూడా కనిపించనునుంది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సి 16లో జాన్వీ నటిస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవల ధృవీకరించారు. తెలుగులో జాన్వీకి ఇది రెండో సినిమా.

Janhvi Kapoor Movie Updates

ఈ రెండు చిత్రాలే కాకుండా జాన్వీ మరో దక్షిణాది హీరోతో కలిసి నటించనుంది. ఆమె తదుపరి చిత్రం కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి నటించనుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత సూర్య దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాతో హిందీలో అరంగేట్రం చేయనున్నాడు. మహాభారత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో జాన్వీని(Janhvi Kapoor) కథానాయికగా ఎంపిక చేశారు.

సూర్య కర్ణన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందని గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. సూర్య కర్ణన్ సినిమాలో జాన్వీ నటిస్తుందని చెప్పారు.

Also Read : The Kerala Story : ఓటీటీలో ఇప్పటికీ దూసుకుపోతున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమా

CommentsJanhvi KapoorMovieTrendingUpdatesViral
Comments (0)
Add Comment