Upasana : మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన సర్ ప్రైజ్ ఇచ్చింది. నటి జాన్వీ కపూర్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చింది. దీంతో తెగ సంతోషానికి లోనైంది ఈ చిన్నది. తను ఈ బహుమానాన్ని మరిచి పోలేనంటూ పేర్కొంది. ఈ సందర్బంగా ఉపాసనకు మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ చెప్పేసింది. ఇదిలా ఉండగా ఉపాసన తన భర్త ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ 16(RC 16) చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Upasana Given Special Gift to Janhvi Kapoor
ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్రలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, భారత క్రికెట్ లెజెండ్ , మాజీ స్కిప్పర్ ధోనీ కూడా నటిస్తుండడం విశేషం. కర్ణాటకలోని కొన్ని లొకేషన్స్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఉపాసన ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమైంది. తన అత్తమ్మ చేసిన స్పెషల్ వంటకాలను తీసుకు వచ్చింది.
వాటిని తన భర్త చెర్రీకి , ఇందులో నటిస్తున్న జాన్వీకి అందజేసింది. చాలా బావున్నాయంటూ కితాబు ఇచ్చింది. వీటిని దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా ఇవ్వడంతా వారంతా సంతోషానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన కొణిదెల స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇవి పోస్ట్ చేసిన వెంటనే వైరల్ గా మారాయి. ఇక ఈ కొత్త చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తీస్తున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అంటూ ఇప్పటికే ప్రకటించాడు బుచ్చిబాబు సన.
ఇక చెర్రీ నటించిన గేమ్ ఛేంజర్ బోల్తా పడడంతో తాను నటిస్తున్న ఈ చిత్రంపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. మరి రిలీజ్ అయితేనే కానీ హిట్టా ఫట్టా అనేది తేలుతుంది. కథ బాగుంటే జనం ఆదరిస్తారు లేక పోతే స్టార్ హీరోలున్నా పట్టించుకోరు. ఇది తండ్రీ కొడుకులకు ఇప్పటికే అర్థమైంది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటించినా ఆశించినంతగా ఆడలేదు.
Also Read : Saptagiri-Pellikani Prasad Sensational :నవ్వులు పూయించిన ‘పెళ్లి కాని ప్రసాద్’