Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తన పుట్టిన రోజు సందర్బంగా ఆర్సీ16 మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Janhvi Kapoor 1st Look from RC16
ఇందులో కీలక రోల్ లో మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తుండగా కథానాయకిగా దివంగత శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్(Janhvi Kapoor) పోషిస్తోంది. ఇక మరో అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. ఆయన నిన్ననే షూటింగ్ లో చేరాడు. ఇందుకు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు దర్శకుడు.
తాజాగా లవ్లీ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు గుర్తుగా సూపర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అందమైన పల్లెటూరి అమ్మాయిలాగా ఉంది. తను ఓ బుచ్చి గొర్రె పిల్లను ఎత్తుకుని నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేశారు.
ప్రస్తుతం ఆర్సీ16 సినిమా షూటింగ్ షెడ్యూల్ లో భాగంగా జాన్వీ కపూర్ ను క్లిక్ మనిపించారని ఇది ఇప్పుడు ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదంటూ పేర్కొన్నారు మూవీ మేకర్స్. మొత్తంగా ఇంకా రిలీజ్ కాకుండానే ఈ చిత్రంపై భారీ అంచనాలు మరింత పెరగడం విశేషం.
Also Read : Beauty Kayadu Lohar :డ్రాగన్ బ్యూటీకి ఆఫర్ల వెల్లువ