Janhvi Kapoor: సూర్య సరసన జాన్వీ కపూర్ ?

సూర్య సరసన జాన్వీ కపూర్ ?

Janhvi Kapoor: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్య ప్రస్తుతం వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘కంగువా’లో నటిస్తున్నాడు. పీరియాడికల్‌ డ్రామాగా అతి భారీ బడ్జెట్ తో సుమారు 38 భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దీనితో ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు.

సుధ కొంగర సినిమాతో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ సినిమాలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉంటుండగానే మరో భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌… మహాభారత ఇతిహాసాన్ని సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్‌.

Janhvi Kapoor Movie Updates

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మహాభారత చిత్రంలో సూర్య ఏ పాత్రను పోషించనున్నారన్నది దర్శకుడు ఇంకా వెల్లడించలేదు. అయితే సూర్యకు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) నటించనున్నట్లు బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో నటిస్తున్న జాన్వీ… మరో రెండు దక్షిణాది సినిమాలో నటిస్తుంది. దీనితో జాన్వీ కపూర్ ను సూర్య సరసన ఎంపిక చేయడానికి దర్శకుడు మెగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Also Read : Director RJ Balaji: ‘యానిమల్’ సినిమాపై కోలీవుడ్ నటుడు, దర్శకుడు సంచలన వ్యాఖ్యలు !

Janhvi KapoorSuriya
Comments (0)
Add Comment