Janhvi Kapoor: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్… బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితేశ్ తివారీతో కలిసి ‘రామాయణం’ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా నిర్మాణం చేపట్టబోయే ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా బాబీ దేవోల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది ఆశక్తిగా మారింది. గతంలో సీత పాత్ర కోసం అలియాభట్ కు లుక్ టెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత సాయి పల్లవిని ఎంపిక చేశారని టాక్ వినిపించింది.
Janhvi Kapoor Movie Updates
అయితే ఇప్పుడు తెరపైకి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు వచ్చింది. ‘రామాయణం’ లో సీత పాత్రకోసం జాన్వీ కపూర్(Janhvi Kapoor) కు దర్శకుడు నితేశ్ తివారీ లుక్ టెస్ట్ చేసినట్లు బీ టౌన్ లో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు నితేశ్ తివారీ ఆఫీస్ వద్ద తాజాగా జాన్వీ కనిపించడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. సీత పాత్ర లుక్ టెస్ట్ కోసమే ఆమె అక్కడికి వెళ్లినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో నితేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘బవాల్’లో జాన్వీ కపూర్ నటించారు. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడటంతో… మరోసారి ఆమెకు అవకాశమివ్వాలని నితేశ్ భావిస్తున్నారని బీ టౌన్ వర్గాల టాక్.
‘రామాయణం’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు భాగాల్లో ఈ సినిమాను తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. దీని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్ తివారీ టీమ్… ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్ టెస్ట్ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ మరికొంతమంది బాలీవుడ్ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన రెండు పార్టులుగా రాబోయే దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్… త్వరలో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాన్వీ తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నవరుసగా మూడు పెద్ద ప్రాజెక్టులు భాగస్వామ్యం కానుందని మాట.
Also Read : Shankar Mahadevan: ఆనంద పరవశంలో శంకర్ మహదేవన్ !