Janhvi Kapoor Interesting : శ్రీ‌వారి స‌న్నిధి లోనే శేష జీవితం

షాకింగ్ ప్ర‌క‌ట‌న చేసిన జాన్వీ క‌పూర్

Janhvi Kapoor : దివంగ‌త న‌టి శ్రీ‌దేవి , బోనీ క‌పూర్ ల ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ ఉన్న‌ట్టుండి వేదాంతం వ‌ల్లిస్తోంది. త‌న‌కు క‌లియుగ దైవంగా భావించే తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ అంటే చ‌చ్చేంత భ‌క్తి. ప్ర‌తి నిత్యం ఆమె ఆ స్వామిని స్మ‌రించుకుంటూ ఉంటుంది. ఎక్క‌డికి వెళ్లినా గోవింద నామ జ‌పం చేయాల్సిందే. ఓ వైపు న‌టిగా ఫుల్ బిజీగా ఉన్న‌ప్ప‌టికీ , త‌న అంత‌రంగం మాత్రం ఆ క‌లియుగ నాథుడి వైపు చూస్తూ ఉంటోంది.

Janhvi Kapoor Interesting Comment..

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం తాను కొన్ని సినిమాల‌కు సంత‌కం చేశాన‌ని, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చేసిన దేవ‌ర బిగ్ హిట్ గా నిలిచిందని, త్వ‌ర‌లోనే సీక్వెల్ సినిమాలో తాను న‌టిస్తున్నాన‌ని చెప్పింది. ప‌నిలో ప‌నిగా త‌న చివ‌రి కోరిక ఏమిటనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది జాన్వీ క‌పూర్.

పెళ్లి చేసుకుని తిరుమ‌ల‌లోనే సెటిల్ కావాల‌న్న‌ది త‌న అభిమతం అంటూ స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా తన పుట్టిన రోజుతో పాటు త‌న త‌ల్లి శ్రీ‌దేవి జ‌యంతి, వ‌ర్దంతి రోజు త‌ప్ప‌కుండా తిరుమల పుణ్య క్షేత్రాన్ని సంద‌ర్శించ‌డం ఆనవాయితీగా వ‌స్తోంది.

Also Read : Hero Vijay Movie : 26న ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ ఫ‌స్ట్ లుక్

CommentsJanhvi KapoorTirumala Tirupathi DevastanamViral
Comments (0)
Add Comment