Janhvi Kapoor : ఓటీటీలో జాన్వీ కపూర్ మూవీ

అమెజాన్ ప్రైమ్ లో వైర‌ల్

Janhvi Kapoor : వ‌రుణ్ ధావ‌న్ , అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ న‌టించిన చిత్రం బ‌వాల్ . ప్ర‌స్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించింది. తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి దేవ‌ర మూవీలో న‌టిస్తోంది జాన్వీ.

Janhvi Kapoor Movie in OTT

ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీనికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక బ‌వాల్ మూవీ విష‌యానికి వ‌స్తే ఇది ప్రేమ క‌థ‌తో ముడి ప‌డి ఉన్నది. అమెజాన్ ప్రైమ్ వీడియో దీనిని స్వంతం చేసుకుంది.

ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుద‌లైంది. ఆశించిన మేర ఆడ‌క పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇది వ‌రుణ్ ధావ‌న్ , జాన్వీ కపూర్(Janhvi Kapoor) ల మ‌ధ్య రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. పార్త్ సిద్ద్ పురా, శ‌శి వ‌ర్మ‌, అర్నోబ్ ఖాన్ అకీబ్ త‌దిత‌రులు స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించారు.

గ‌తంలో దంగ‌ల్ లాంటి విజ‌య‌వంత‌మైన సినిమా తీసిన ద‌ర్శ‌కుడు నితేష్ తివారీ బ‌వాల్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం. సాజిద్ న‌డియా వాలా కు చెందిన నిర్మాణ సంస్థ విడుద‌ల చేసింది. ఇక బ‌వాల్ టీజ‌ర్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్రైమ్ లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది.

Also Read : Chiranjeevi : చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు

Comments (0)
Add Comment