బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణంగా టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరొందిన తారక్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. విచిత్రం ఏమిటంటే తను ప్రముఖ దివంగత నటి శ్రీదేవి కూతురు కావడం. ఆమె జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావుతో కలిసి అడవి రాముడులో నటించింది. ఆనాడు తాతతో మనుమడు. ఇవాళ మనుమడితో జాన్వీ కపూర్ నటిస్తుండడం విశేషం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడు కొరటాల శివ. తను బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. డార్లింగ్ ప్రభాస్ తో మిర్చి తీశాడు అది సక్సెస్. ప్రిన్స్ మహేష్ బాబుతో శ్రీమంతుడు తీశాడు అది బ్లాక్ బస్టర్. ఇక మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ తో తీసిన ఆచార్య ఒక్కటే బెడిసి కొట్టింది.
అయినా ఒక్క సినిమా ఫెయిల్ అయ్యిందంటే ఏ హీరో నటించేందుకు ముందుకు రాడు. కానీ తారక్ తన మనసు మార్చుకున్నాడు. గతంలో ఇదే దర్శకుడు శివ బిగ్ హిట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ కు. మోహన్ లాల్ కీలక పాత్రలో జనతా గ్యారేజ్ తీశాడు. ఇది బిగ్ హిట్. ప్రస్తుతం తారక్ కీ రోల్ తో దేవర తీస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ ను తీసుకున్నాడు. షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.