Janaka Aithe Ganaka: ఆసక్తిగా సుహాస్ ‘జనక అయితే గనక’ టీజర్‌ !

ఆసక్తిగా సుహాస్ ‘జనక అయితే గనక’ టీజర్‌ !

Janaka Aithe Ganaka: వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్న నటుడు సుహాస్‌. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక(Janaka Aithe Ganaka)’. ఈ సినిమాలో సంగీర్త‌న హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విజ‌య్ బుల్గ‌నిన్ సంగీతం అందిస్తుండ‌గా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Janaka Aithe Ganaka…

ఇక టీజర్ విషయానికి వస్తే… ‘ఆ ఒక్క డెసిషన్‌ నా లైఫ్‌ని మార్చేసింది’ అంటూ హీరో తన పరిస్థితి గురించి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి త‌న‌కు పుట్ట‌బోయే పిల్ల‌ల విష‌యంలో ఎలాంటి ప్లానింగ్ చేస్తాడు.. వారి భ‌విష్య‌త్తు కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు.. అనే స‌బ్జెక్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఇక మిడిల్ క్లాస్ వ్య‌క్తిగా సుహాస్ పాత్ర చాలా మందికి ఇట్టే క‌నెక్ట్ అయ్యే విధంగా ఉండ‌నుంది. ఈ సినిమా టీజ‌ర్ క‌ట్ ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read : Captain Miller: ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ కు అంతర్జాతీయ అవార్డు !

Janaka Aithe GanakaSuhas
Comments (0)
Add Comment