Jailer Record : త‌మిళ‌నాట జైల‌ర్ రికార్డుల మోత‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ సెన్సేష‌న్

Jailer Record : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ దూసుకు పోతోంది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఆగ‌స్టు 10న విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు రాబ‌డుతోంది. నిర్మాతల‌కు కాసుల పంట పండుతోంది.

Jailer Record Blockbuster

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌కత్వంలో త‌లైవా రజ‌నీ కాంత్ , ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా, యోగి బాబు, శివ రాజ్ కుమార్ , మోహ‌న్ లాల్ , ర‌మ్య కృష్ణ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించారు. ర‌జ‌నీకాంత్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఫిలిమ్ గా జైల‌ర్(Jailer) చిత్రం నిలిచింది.

మూవీ మేక‌ర్స్ ఆగ‌స్టు 10న ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. త‌మిళ‌నాట అరుదైన రికార్డు న‌మోదు చేసింది. ఇప్ప‌టికే రూ. 207 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించింది. సినీ రంగాన్ని విస్తు పోయేలా చేసింది.

72 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ర‌జ‌నీ కాంత్ ఇప్ప‌టికే యువ హీరోల‌తో పోటీ ప‌డుతున్నారు. త‌న స్టామినా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తున్నాడు. ఒక్క త‌మిళ‌నాట‌నే జైల‌ర్ ఒక‌ట‌వ వారం రూ. 159.02 కోట్లు వ‌సూలు చేసింది. 2వ వారం లో రూ. 42.83 కోట్లు కొల్ల‌గొట్టింది. మూడ‌వ వారం 1వ రోజు రూ. 2.95 కోట్లు, 2వ రోజు రూ. 2.64 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా జైల‌ర్ వ‌సూళ్లు రూ. 207.44 కోట్లు కావ‌డం విశేషం.

Also Read : TOP Movies 2024 : 2024లో టాప్ మూవీస్ రిలీజ్

jailer rajinikanth tamanna bhatia record collections
Comments (0)
Add Comment