Jailer Record : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్ మూవీ దుమ్ము రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ఏకంగా రూ .622.03 కోట్లు కొల్లగొట్టింది.
Jailer Record Breaking Movie
అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం జైలర్(Jailer) కు అదనపు బలాన్ని ఇచ్చింది. విడుదలైన నాటి నుంచి నేటి దాకా రికార్డుల మోత మోగిస్తోంది ఈ మూవీ. కలెక్షన్ల పరంగా చూస్తే 1వ వారంలో రూ. 450.80 కోట్లు, 2వ వారంలో రూ. 124.18 కోట్లు వసూలు చేసింది. మూడవ వారంలో 1వ రోజు రూ. 7.67 కోట్లు, 2వ రోజు రూ. 6.03 కోట్లు, 3వ రోజు రూ. 8.36 కోట్లు, 4వ రోజు రూ. 10.25 కోట్లు, 5వ రోజు రూ. 5.12 కోట్లు, 6వ రోజు రూ. 5.39 కోట్లు, 7వ రోజు రూ. 4.23 కోట్లు కొల్లగొట్టింది.
డైరెక్టర్ మేకింగ్, టేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చాడు నెల్సన్ దిలీప్ కుమార్. కన్నడ నాట దిగ్గజ నటుడిగా పేరు పొందిన శివ రాజ్ కుమార్ , మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ కమెడియన్ గా గుర్తింపు పొందిన యోగి బాబు జైలర్ లో కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా రజనీకాంత్ మేనియా దెబ్బకు కాసులు గలగలమంటున్నాయి.
Also Read : Bandla Ganesh : నాణేనికి రెండు వైపులా – బండ్ల గణేష్