Jailer Producer : జైల‌ర్ ద‌ర్శ‌కుడికి సూప‌ర్ గిఫ్ట్

అంద‌జేసిన నిర్మాత మార‌న్

Jailer Producer : స‌న్ మూవీ పిక్చ‌ర్స్ నిర్మించిన జైల‌ర్ చిత్రం బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఊహించ‌ని రీతిలో ఆగ‌స్టు 10న విడుదలైన జైల‌ర్ ప్ర‌తి చోటా కాసులు కొల్ల‌గొడుతోంది. ఒక్క త‌మిళ‌నాడు లోనే రూ. 225 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ మూవీగా నిలిచింది జైల‌ర్.

Jailer Producer Gift Presented to Director

ఈ చిత్రానికి యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌లైవా ర‌జ‌నీ కాంత్ మేన‌రిజాన్ని ఎలివేట్ చేస్తూ సూప‌ర్ సినిమా తీశాడు. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టి దాకా ఏకంగా రూ. 600 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించింది జైల‌ర్ మూవీ.

ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ తో పాటు త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ , ర‌మ్య కృష్ణ‌న్ , యోగి బాబు న‌టించారు. ఇక అనిరుధ్ ర‌విచంద‌ర్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. దీంతో స‌న్ నెట్ వ‌ర్క్ చీఫ్ , డీఎంకే ఎంపీ క‌ళానిధి మార‌న్ ఏకంగా ర‌జ‌నీకాంత్ కు రూ. 100 కోట్ల చెక్ ఇచ్చాడు. ఆపై కోటిన్న‌ర రూపాయ‌ల విలువ చేసే బీఎండ‌బ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

తాజాగా త‌మ‌కు అత్యంత ఆదాయం క‌లిగించేలా జైల‌ర్ ను రూపొందించిన ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ఇంటికి స్వ‌యంగా వెళ్లారు మార‌న్. ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆపై చెక్కుతో పాటు, కొత్త కారు తాళం చెవ్విని అంద‌జేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : Hari Hara Veera Mallu : హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుపై ఉత్కంఠ

Comments (0)
Add Comment