Jailer OTT Release : యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియా నటించిన జైలర్(Jailer) రికార్డుల మోత మోగిస్తోంది. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లు దాటేసింది.
Jailer OTT Release Viral
దీంతో సన్ నెట్ వర్క్స్ చీఫ్ , డీఎంకే ఎంపీ కళానిధి మారన్ ఏకంగా వచ్చిన లాభంలో రూ. 100 కోట్ల చెక్కును ఇచ్చాడు. అంతే కాదు కోటిన్నర విలువ చేసే బీఎండబ్ల్యూ కారును కూడా బహుమతిగా ఇచ్చాడు.
అనంతరం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు నిర్మాత బ్లాంకు చెక్కు ఇచ్చాడు. ఎంతైనా తీసుకోమని . తాము పెట్టిన పెట్టుబడి కంటే అత్యధికంగా రావడంతో ఊహించని రీతిలో రెస్పాండ్ అయ్యాడు.
దీంతో ఎవరికి ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో దక్కుతుందనే ఉత్కంఠకు తెర దించారు మూవీ మేకర్స్. దీనిని ప్రైమ్ టైమ్ వీడియోలో సెప్టెంబర్ 7న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
రజనీకాంత్ మేనజరిజం, తమన్నా అందం, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ , రమ్య కృష్ణన్ నటన, యోగి బాబు కామెడీ , అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం జైలర్ ను బాక్సులు బద్దలు కొట్టేలా చేసింది. జైలర్ కథ రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్ పాండియన్ ఆధారంగా తీశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
Also Read : Samantha Ruth Prabhu : ఖుషితో సమంత ఖుషీ