Jailer Movie : బుల్లి తెర‌పై త‌లైవా జైల‌ర్

ద‌క్కించుకున్న జెమిని ఛానెల్

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్. త‌ను ఇటీవ‌ల నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన జైల‌ర్ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 650 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సినిమాను ప్ర‌ముఖ సినీ , మీడియా నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో నిర్మించారు. భారీ ఎత్తున రెమ్యున‌రేష‌న్ కూడా ఇచ్చారు.

ఆశించిన దానికంటే ఎక్కువ‌గా వ‌సూళ్లు సాధించింది. ఇక శాటిలైట్ రైట్స్ , ఓటీటీ రైట్స్ ద్వారా భారీగా ఆదాయం స‌మ‌కూరింది. తాజాగా మ‌రో అప్ డేట్ వ‌చ్చింది జైల‌ర్ గురించి. ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది జైల‌ర్.

బుల్లి తెర‌కు సంబంధించి జెమిని సంస్థ కైవసం చేసుకుంది జైల‌ర్ చిత్రాన్ని. ఇందులో ర‌జ‌నీకాంత్ తో పాటు అందాల తార త‌మ‌న్నా భాటియా, శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్, సునీల్ , యోగి బాబు, ర‌మ్య కృష్ణ , త‌దిత‌రులు న‌టించారు. ఇక రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందించాడు. మొత్తంగా జైల‌ర్ బుల్లి తెర‌పై ప్ర‌సారం కాబోతోంది

Comments (0)
Add Comment