Jailer Movie : తమిళనాట ఎన్ని సినిమాలు వచ్చినా తనకు ఎదురే లేదని చాటింది రజనీకాంత్, తమన్నా నటించిన జైలర్ చిత్రం. కాసుల వర్షం కురిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న విడుదలైంది ఈ చిత్రం. ఏకంగా వరల్డ్ వైడ్ గా ఊహించని రీతిలో రూ. 600 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
Jailer Movie Collections
తాజాగా తమిళనాడులో భారీ ఎత్తున కలెక్షన్లు సాధిస్తోంది. రూ. 233 కోట్లకు పైగా వసూలు చేస్తోంది. నాలుగు వారాలు పూర్తయ్యాయి మూవీ విడుదలై. జైలర్(Jailer Movie) చిత్రానికి సంబంధించి చూస్తే 1వ వారంలో రూ. 159.02 కోట్లు వసూలు చేసింది. ఇక 2వ వారంలో రూ. 42.83 కోట్లు, 3వ వారంలో రూ. 22.75 కోట్లు సాధించింది.
4వ వారానికి సంబంధించి చూస్తే 1వ రోజు రూ. 1.70 కోట్లు , 2వ రోజు రూ. 1.04 కోట్లు , 3వవ రోజు రూ. 1.81 కోట్లు, 4వ రోజు రూ. 2.07 కోట్లు, 5వ రోజు రూ.0.96 కోట్లు , 6వ రోజు రూ. 0.81 కోట్లు , 7వ రోజు రూ. 0.63 కోట్లు వసూలు చేసింది జైలర్ మూవీ. మొత్తంగా ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 7వ తేదీ దాకా చూస్తే రూ. 233.62 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read : Ek Dum Ek Dum Song : ఏక్ దమ్ ఏక్ దమ్ ధనా ధన్