Jailer Movie : తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సృష్టించుకున్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఒకటా రెండా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది జైలర్. సన్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో జైలర్ చిత్రాన్ని నిర్మించింది. ఊహించని రీతిలో భారీ వసూళ్లను సాధించింది ఈ చిత్రం.
Jailer Movie Records
సూపర్ స్టార్ రజనీకాంత్ , అందాల ముద్దుగుమ్మ తమన్నా భాటియా , కమెడియన్ యోగి బాబు , శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ , రమ్య కృష్ణన్ ప్రత్యేక పాత్రలలో నటించారు. ఆగస్టు 10న విడుదలైన జైలర్ చిత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా వసూలు చేసింది.
ప్రస్తుతం చిత్రం నాల్గవ వారంలోకి ఎంట్రీ అయ్యింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్ము రేపుతోంది. ఇదే దర్శకుడు ఇదే నిర్మాణ సంస్థతో తలపతి విజయ్ తో బీస్ట్ తీశాడు. కానీ ఆశించిన మేర సక్సెస్ కాలేదు.
ఇక రజనీకాంత్ నటించిన జైలర్(Jailer Movie) చిత్రం కలెక్షన్ల పరంగా చూస్తే 1వ వారంలో రూ. 450.80 కోట్లు వసూలు చేసింది. 2వ వారంలో రూ. 124.18 కోట్లు, 3వ వారంలో రూ. 47.05 కోట్లు వసూలు చేసింది.
ఇక నాల్గవ వారానికి సంబంధించి చూస్తే 1వ రోజు రూ. 3.92 కోట్లు, 2వ రోఉ రూ. 3.11 కోట్లు, 3వ రోజు రూ. 4.17 కోట్లు, 4వ రోజు రూ. 4.56 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా రూ. 637.79 కోట్లు వసూలు చేసింది. రికార్డు బ్రేక్ చేసింది.
Also Read : South Directors Record : రూ. 600 కోట్ల క్లబ్ లో ఆ నలుగురు