Jai Hanuman : హనుమాన్ సినిమా ప్రశాంత్ గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. విడుదల సమయానికి సరైన థియేటర్ దొరకలేదు. అయితే ఎన్నో కష్టాలను ఓర్చుకుని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంక్రాంతి సక్సెస్ సొంతం చేసుకుంది. అంతేకాదు, ఇప్పటి వరకు సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Jai Hanuman Announced Prashanth Varma
బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ దూకుడు మొదటి రోజు నుండి కొనసాగుతోంది. ప్రీమియర్ స్క్రీనింగ్ ద్వారా 3 కోట్ల రూపాయలకు పైగా మార్కెట్ షేర్ నుంచి 6కోట్లు సంపాదించింది సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక హనుమాన్… మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తీ చేసుకొని సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. అంతేకాదు హనుమాన్ సినిమా 2024లో మన దేశంలోనే తొలి టాలీవుడ్ హిట్ సినిమాగా నిలిచింది.
ఇదిలా ఉంటే, ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ ఫార్మాట్‌లో నిర్మాతలకు రూ.40 కోట్ల అదనపు లాభం ఉంటుంది. ఓవరాల్ గా అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్న ఈ శుభ తరుణంలో హనుమాన్ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టడం శుభపరిణామం. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రకని, గెటప్ శ్రీను ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ‘విజువల్ ఫీస్ట్’గా ప్రశంసలు అందుకుంది.
ఇదిలావుంటే… హనుమాన్ చిత్ర క్లైమాక్స్ కు సీక్వెల్ గా జై హనుమాన్ చిత్రాన్ని రూపొందిస్తానని దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ప్రకటించాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బలరాముడి జన్మదినం సందర్భంగా ప్రకటించారు. ‘హనుమాన్’ చిత్రంలో నటించిన తేజ సజ్జ ఈ చిత్రంలో కూడా కథానాయికగా నటించనున్నాడా? మరో స్టార్ హీరో చేరతాడో చూడాలి. “హనుమాన్` సినిమాతో ఇండియా మొత్తం బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా “జై హనుమాన్ ”తో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read : Ayodhya Shree Ram : వైరల్ అవుతున్న ”అయోధ్య శ్రీ రామ్” ఆల్బమ్