Amala Paul Marrige : ఒక్కోసారి సర్ ప్రైజ్ ఇవ్వడంలో సినిమా నటుల తర్వాతే ఎవరైనా. మొదటి భర్తతో మూడేళ్లు కాపురం చేసింది ప్రముఖ నటి అమలా పాల్(Amala Paul). ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ తామిద్దరం విడి పోతున్నట్లు ప్రకటించారు.
Amala Paul Marrige Viral
ఆ వెంటనే మనసు మార్చుకుంది అమలా పాల్. ఇంకేం ఎలాంటి ఆలస్యం చేయకుండా బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుంది. అతడితో డేటింగ్ చేస్తూ వచ్చింది. ఇద్దరూ ఎంచక్కా గోవాకు వెళ్లారు. అక్కడ తెగ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
అమలా పుట్టిన రోజు సందర్బంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్బంగా తన ప్రియుడు జగత్ దేశాయ్ కు మరిచి పోలేని గిఫ్ట్ ఇచ్చారు. పెదవులపై అనుకోకుండా గట్టిగా ముద్దు. ఆ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఉన్నట్టుండి ఆ ఫోటోల గురించి చర్చ జరుగుతుండగానే మరో ట్విస్ట్ ఇచ్చింది అమలా పాల్. ఆదివారం కేరళ లోని కొచ్చిలో సాయంత్రం ఘనంగా పెళ్లి చేసుకున్నారు అమలా పాల్ జగత్ దేశాయ్. రెండు మనసులు ఒక్కటైన వేళ ఈ చేయిని చివరి దాకా వదలనంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యారేజ్ ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Gunturu Karam First Single : గుంటూరు కారం ఫస్ట్ సింగిల్