Jabardasth Rakesh : మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ పోస్ట్ పెట్టిన జబర్దస్త్ రాకేష్

ప్రస్తుతం రాకింగ్ రాకేష్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది...

Jabardasth Rakesh : జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒకరు. జోడీగా బోలెడు కామెడీ స్కిట్లు చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారీ ట్యాలెంటెడ్ యాక్టర్స్. రీల్ లైఫ్‌లో జంటగా నటించిన వీరిద్దరు నిజ జీవితంలోనూ జోడీగా మారారు. జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. గతేడాది ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్, సుజాత.

ఇప్పుడు వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్. రాకింగ్ రాకేష్(Jabardasth Rakesh), సుజాత అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. సుజాత పండంటి ఆడ బిడ్డను ప్రసవించింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా వారే అధికారికంగా వెల్లడించారు. ‘ మేము తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్నాం. సుజాత పండండి పాపకు సుజాత జన్మనిచ్చింది. ఈ అపురూపమైన క్షణాలు తన జీవితంలో ఒక అద్భుతం. జీవితంలో సగ భాగం అయిన సుజాత ఓ బిడ్డకు తల్లిగా ఆనందించే ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్త్రీని గౌరవిద్దాం.. పూజిద్దాం’ అంటూ ఎమోషనల్ అయ్యాడు రాకింగ్ రాకేష్.

Jabardasth Rakesh Post..

ప్రస్తుతం రాకింగ్ రాకేష్(Jabardasth Rakesh) షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ కపుల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సుజాత కొన్ని రోజుల క్రితమే బిడ్డను ప్రసవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరు అమ్మానాన్నలైనట్లు పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన రాకింగ్ రాకేశ్ త్వరలో హీరోగా నూ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కేసీఆర్ పేరుతో ఒక డిఫరెంట్ సినిమాను రాకింగ్ రాకేశ్ పట్టాలెక్కించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు మదురై స్టేషన్ లో కేసు నమోదు

Rocking RakeshTrendingUpdatesViral
Comments (0)
Add Comment