Jabardasth: జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బుల్లెట్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన స్కిట్స్, కామెడీతో ఎంతో మంది మదిని దోచుకున్నాడు.అయితే తాజాగా బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్(Jabardasth) షోలో గుండు కొట్టించుకొని కనిపించాడు. ఇక ఇది చూసిన కొందరు భాస్కర్ ఎందుకు గుండు గీయించుకున్నాడు అంటూ తెగ ముచ్చటిస్తున్నారు.
Jabardasth Bullet Bhaskar Shocking Decision
కాగా షోలో బుల్లెట్ భాస్కర్ తన టీంతో కలిసి నిజం సినిమా స్కిట్ చేస్తుంటారు. అందులో భాస్కర్ గోపి చంద్ పాత్ర చేయగా, ఈ స్కిట్ పై ఖుష్బూ, కృష్ణ భగవాన్ అభ్యతరాన్ని తెలియచేస్తారు.
ఇందులో గోపీచంద్ గుండుతో కనిపిస్తూ ఉంటారని కృష్ణ భగవాన్ అంటూ ఉండగా అందుకు భాస్కర్ రియాక్ట్ అవుతూ ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి సార్ మధ్యలో అంటే చాలా కష్టమవుతుందని తెలియజేశారు. ఈ సమయంలోనే ఖుష్బూ రియాక్ట్ అవుతూ స్మూప్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి ఇక్కడ ఫీల్ అవ్వడానికి ఏం లేదని తెలిపింది. దీంతో తాను స్కిట్ కోసం ప్రాణమైన ఇస్తానంటూ తెలిపిన బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ షోలోని గుండు గీయించుకుని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.
Also Read : Captain Vijayakanth: ఆస్పత్రిలో చేరిన కెప్టెన్ విజయకాంత్