Auto Ram Prasad : జబర్దస్త్ నటుడు ఆటో రాంప్రసాద్ద్ కి యాక్సిడెంట్

జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ఇళ్లలో మంచి పేరు సంపాదించుకున్న హాస్యనటుడు రాంప్రసాద్...

టీవీ షోలలో తనదైన రైటింగ్, యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో స్మాల్ స్క్రీన్ త్రివిక్రమ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్ ORR గుండా ప్రయాణిస్తుండగా ఆయన గాయపడ్డారు. ఇంతకీ ఆయనకేమైంది?

Auto Ram Prasad Accident

జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ఇళ్లలో మంచి పేరు సంపాదించుకున్న హాస్యనటుడు రాంప్రసాద్. ఆయన గురువారం షూటింగ్ నిమిత్తం తుక్కుగూడ ORR గుండా తన కారులో ప్రయాణిస్తుండంగా ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేసింది. దీంతో రాంప్రసాద్ కారు.. ఆ కారుని ఢీ కొట్టింది. వెనుక నుండి వస్తున్న మరో ఆటో కూడా కారుని ఢీ కొట్టడంతో కారు డ్యామేజ్ అయ్యింది. ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు.

Also Read : Mythri Movie Makers : అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంటూ వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన నిర్మాణ సంస్థ

ActorBreakingJabardasth Comedy ShowUpdatesViral
Comments (0)
Add Comment