Dil Raju Shocking – IT Raids : దిల్ రాజు ఇళ్లు..నివాసాల‌పై ఐటీ దాడులు

8 చోట్ల 55 బృందాలతో సోదాలు

Dil Raju : హైద‌రాబాద్ – తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ , ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌నకు సంబంధించిన ఆఫీసులు, నివాసాల‌లో ఏక కాలంలో ఆదాయ ప‌న్ను (ఐటీ) శాఖ ఆధ్వ‌ర్యంలో దాడులు జ‌రిగాయి. హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర ప్రాంతాల‌లో దాడుల‌కు దిగారు.

IT Raids on Producer Dil Raju House..

మొత్తం 8 చోట్ల 55 బృందాల‌తో త‌నిఖీలు చేప‌ట్టారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో దిల్‌ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ, ఆఫీసుల్లోనూ ఐటీ టీమ్స్ జ‌ల్లెడ ప‌డుతున్నారు. అంతే కాకుండా వ్యాపార భాగ‌స్వాముల నివాసాల్లోనూ త‌నిఖీలు చేప‌ట్టారు. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు నిర్మాత దిల్ రాజు.

ఇదిలా ఉండ‌గా దిల్ రాజు తాజాగా రెండు సినిమాల‌ను నిర్మించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ , కియారా అద్వానీతో గేమ్ ఛేంజ‌ర్ ను రిలీజ్ చేస్తే, అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు మూవీస్ ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి.

గేమ్ ఛేంజర్ మూవీ అట్ట‌ర్ ప్లాప్ కాగా సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ మాత్రం అద్భుత‌మైన స‌క్సెస్ మూట‌గ‌ట్టుకుంది.

Also Read : Hero Akhil Marriage : అఖిల్ అక్కినేని జైనాబ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్

dil rajuIT RaidsUpdatesViral
Comments (0)
Add Comment