Sukumar Shocking – IT Raids : డైరెక్ట‌ర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు

మ‌రో వైపు డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది... పుష్ప‌, పుష్ప‌-2 మూవీస్ డైరెక్ట‌ర్

Sukumar : ఆదాయ ప‌న్ను శాఖ జూలు విదిల్చింది. నిన్న తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్, నిర్మాత దిల్ రాజు తో పాటు సింగ‌ర్ సునీత భ‌ర్త రాము కంపెనీ, పుష్ప‌, పుష్ప‌-2 మూవీస్ నిర్మాణం చేప‌ట్టిన మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇళ్ల‌ల్లో ఏక కాలంలో హైద‌రాబాద్ లో సోదాలు చేప‌ట్టారు.

Director Sukumar Comments

దిల్ రాజు, భార్య తేజ‌స్విని, న‌వీన్ ఎర్నేని, దిల్ రాజు కొడుకు శిరీష్, కూతురు స్నేహితా రెడ్డి ఇళ్లు, నివాసాల‌లో దాడులు నిర్వ‌హించారు. రెండో రోజు కూడా ఐటీ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌లు బృందాలు త‌నిఖీలు చేప‌ట్టారు.

మ‌రో వైపు డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌ను పుష్ప , పుష్ప‌-2 సీక్వెల్ సినిమాలు తీశాడు. త‌న‌కు భారీ ఎత్తున నిర్మాత‌లు ముట్ట చెప్పిన‌ట్లు టాక్. కాగా పుష్ప‌తో పాటు పుష్ప‌-2 రికార్డుల మోత మోగించింది. ఏకంగా పుష్ప -2 మూవీ 46 రోజుల్లో రూ. 1830 కోట్లు వ‌సూలు చేసింది. ఇందుకు సంబంధించి స‌మ‌ర్పించిన డాక్యుమెంట్లను ప‌రిశిలీస్తోంది.

ఐటీ శాఖ టాలీవుడ్ పై న‌జ‌ర్ పెట్ట‌డంతో మిగ‌తా సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.

Also Read : IT Raids Shocking Tollywood : టాలీవుడ్ లో ఐటీ దాడుల క‌ల‌క‌లం

IT RaidssukumarUpdatesViral
Comments (0)
Add Comment