Tollywood : ఐటీ రైడ్స్ తో టాలీవుడ్ షేక్ అవుతోంది. పాన్ ఇండియా సినిమాలు ఇక్కడి నుంచి వస్తుండడం , దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఐటీ కన్ను పడింది. పలు బృందాలు జల్లెడ పడుతున్నాయి. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, సంస్థలపై దాడులు చేపట్టారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఐటీ దాడుల పరంపర మూడో రోజుకు చేరుకుంది. ఫస్ట్ టైం ఇన్ని రోజులుగా సోదాలు చేపట్టడం.
IT Raids Shocking Tollywood…
ప్రముఖ సినీ నిర్మాతలు, సంస్థలకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో విస్తృతంగా తనికీలు చేశారు. సినిమాలకు సంబంధించి నిర్మాణ వ్యయాలు, వాటికి సంబంధించిన లావాదేవీల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ తీసిన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు , కొడుకు శిరీష్, కూతురు స్నేహితా రెడ్డికి చెందిన ఇళ్లు, ఆఫీసులను తనిఖీ చేశారు.
తన భార్య తేజస్వినితో కలిసి బ్యాంకులలో లాకర్లను తెరిచి చూశారు. ఇందుకు సంబంధించి పత్రాలను తీసుకున్నారు. మరో వైపు పుష్ప-2 మూవీ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీసుల్లోనూ జల్లెడ పట్టారు. అంతే కాకుండా దర్శకుడు సుకుమార్ ఇంటిపై దాడి చేశారు. ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Hero Bunny-Pushpa 2 Record : వసూళ్ల వేటలో పుష్పరాజ్ రికార్డ్