Dil Raju : హైదరాబాద్ – ఐటీ రైడ్స్ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. కంటిన్యూగా శుక్రవారంతో నాలుగు రోజులయ్యాయి సోదాలు జరపడం. ఇప్పటి వరకు హైదరాబాద్ లోని చాలా చోట్ల 55 బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, రవిలకు చెందిన నివాసాలు, ఆఫీసులను తనిఖీ చేశారు. చిత్రాల నిర్మాణాలకు సంబంధించి జరిగిన లావాదేవీలను, ఎంత మేరకు వసూలు అయ్యాయి, ప్రకటించిన సంఖ్య ఎంత అనే దానిపై ఆరా తీశారు.
Dil Raju IT Raids
ఇక దిల్ రాజుతో పాటు భార్య తేజస్వినికి చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఆయా బ్యాంకులలో ఉన్న లాకర్లను తెరిచి చూశారు. ఆస్తులు, డబ్బుల లెక్కల గురించి అడిగారు. ఐటీ రిటర్న్ లో పేర్కొన్న దానికి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయో లేదోనని పరిశీలించారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ తో పాటు కూతురు స్నేహితా రెడ్డికి చెందిన ఇళ్లను కూడా జల్లెడ పట్టారు.
ఆ వెంటనే దిల్ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వెంట పెట్టుకుని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుకు తీసుకు వెళ్లారు. అక్కడ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అసలు పేరు బండ్ర వెంకట రమణా రెడ్డి.
Also Read : Popular Director 8 Vasanthalu : మనసు దోచిన ‘8 వసంతాలు’ టీజర్