IPL Final Schedule : టాటా ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖ‌రారు 

ప్ర‌క‌టించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా 

IPL Final : కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) . అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన టాటా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సంవ‌త్స‌రానికి షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు బీసీసీఐ(BCCI) కార్య‌ద‌ర్శి జే షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అధికారికంగా మ్యాచ్ ల తేదీలను వెల్ల‌డించారు.

IPL Final Schedule

టాటా ఐపీఎల్ 2025 టోర్నీ అధికారికంగా వ‌చ్చే నెల మార్చి 22న ప్రారంభం కానుంది. మొత్తం 10 జ‌ట్లు పాల్గొంటాయి. ప్ర‌తి జ‌ట్టు మ‌రో జ‌ట్టుతో ఆడుతుంది. ఆయా జ‌ట్ల‌ను రెండు గ్రూప్ లుగా విభ‌జించారు. మొత్తం దేశంలోని 13 పేరు పొందిన మైదానాల‌లో ఐపీఎల్ జ‌ట్లు నిర్దేశించిన మేర‌కు మ్యాచ్ ల‌ను ఆడ‌తాయి.

ఐపీఎల్ టోర్నీ మొత్తం 65 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. 10 జ‌ట్లు 74 మ్యాచ్ లు ఆడ‌తాయి. ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ మే 5న జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు కార్య‌ద‌ర్శి జే షా. గెలుపొందిన విజేత‌కు భారీ ఎత్తున ప్రైజ్ మ‌నీ ద‌క్క‌నుంది.

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ టోర్నీలో తొలి మ్యాచ్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. గ‌త ఏడాది జ‌రిగిన ఐపీఎల్ టోర్నీని కేకేఆర్ గెలుపొందింది. ఆర్సీబీని ఫైన‌ల్ లో ఓడించింది.

Also Read : Hero Naga Chaitanya-Thandel :రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి తండేల్

IPL 2025UpdatesViral
Comments (0)
Add Comment