IPL 2025 : ముంబై – ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన ఫార్మాట్ గా పేరు పొందింది టాటా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) . ఈ ఏడాది మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఎప్పటి లాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులు ప్రధాన ఆకర్షణగా మారనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కీలక ప్రకటన చేసింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్(IPL 2025) ప్రారంభోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహొంచేందుకు ప్లాన్ చేశామని ప్రకటించారు బీసీసీఐ బాద్ షా జే షా .
IPL 2025 Special Guests
ఇక ఐపీఎల్ ప్రారంభోత్సవానికి సినీ దిగ్గజాలు హాజరు కానున్నారు. ప్రత్యేకించి టాప్ స్టార్స్ ఇందులో పాల్గొంటుండడం విశేషం. వీరిలో మోస్ట్ పాపులర్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ , శ్రద్దా కపూర్, వరుణ్ ధావన్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ కీలక పోరు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
టాప్ హీరో హీరోయిన్లతో పాటు దిశా పటానీ తన మ్యాజిక్ ను జోడించేందుకు సిద్దమైంది. ఇక టాప్ సింగర్స్ శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, కరణ్ ఆజ్లా పాల్గొంటారని తెలిపారు జేషా. వీరితో పాటు సంజయ్ దత్, సారా అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ , త్రిప్తి దిమ్రీ, అనన్య పాండే, జాన్వీ కపూర్, మాధురీ దీక్షిత్, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలా, ఆయుష్మాన్ ఖురానా ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవానికి హాజరవుతారని భావిస్తున్నారు.
Also Read : Chahal-Dhanasri Divorce Shocking :చెదిరిన స్వప్నం వీడిన వివాహ బంధం