Smriti Mandhana Aggressive : చెల‌రేగిన స్మృతి మంధాన‌..ప్ర‌తీకా రావ‌ల్

ఐర్లాండ్ వ‌న్డేలో 436 ప‌రుగుల భారీ స్కోర్

Smriti Mandhana : భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించింది. ఐర్లాండ్ తో జ‌రిగిన కీల‌క వ‌న్డే మ్యాచ్ లో ఏకంగా 436 ప‌రుగులు చేసింది. స్టార్ క్రికెట‌ర్లు స్మృతీ మంధాన(Smriti Mandhana) ఫాస్టెస్ట్ సెంచ‌రీతో దుమ్ము రేపితే ప్ర‌తీకా రావ‌ల్ సెన్సేష‌న్ ఇన్నింగ్స్ ఆడింది.

ప్ర‌తీకా రావ‌ల్ 154 ప‌రుగులు చేసి అవుట్ కాగా భారీ టార్గెట్ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ముందు ఉంచింది. రాజ్ కోట్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ఆద్యంతం భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. మ్యాచ్ ప‌రంగా చూస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది టీమిండియా.

Smriti Mandhana Aggressive Game..

కేవ‌లం 70 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న స్మృతీ మంధాన అత్యంత వేగ‌వంత‌మైన శ‌త‌కం సాధించింది. తొలి భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్ గా రికార్డ్ బ్రేక్ చేసింది ఈ ముంబై క్రీడాకారిణి. ఈ ఫాస్టెస్ట్ సెంచ‌రీలో 12 ఫోర్లు 7 సిక్స‌ర్లు ఉన్నాయి. ఫోర్లు, సిక్స‌ర్ల ద్వారా 90 ప‌రుగులు చేసింది స్మృతీ మంధాన‌.

త‌ను 135 ప‌రుగుల వ‌ద్ద పెవిలియ‌న్ బాట ప‌ట్టింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ సాధించింది. ప్ర‌తీకా రావ‌ల్ 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు ఓ సిక్స‌ర్ తో 154 ప‌రుగులు చేసింది. తొలి వికెట్ కు వీరిద్ద‌రూ 233 ర‌న్స్ చేశారు.

Also Read : ప్ర‌భాస్ వైర‌ల్ రాజా సాబ్ హ‌ల్ చ‌ల్

CricketTrendingWomen
Comments (0)
Add Comment