World Singer Chandrika Won : భార‌తీయ‌ అమెరిక‌న్ గాయ‌నికి గ్రామీ అవార్డ్

మ‌ర‌ణాంత‌రం జిమ్మీ కార్ట‌ర్ కు కూడా

Singer Chandrika : అమెరికా – ఇండో అమెరిక‌న్ సింగ‌ర్ చంద్రికా టాండ‌న్ కు అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. అమెరికా లోని లాస్ ఏంజిల్స్ వేదిక‌గా 67వ గ్రామీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. తాను రూపొందించిన త్రివేణి ఆల్బ‌మ్ కు గ్రామీ అవార్డు ల‌భించింది. గ‌త ఏడాది 2024 ఆగ‌స్టు నెల‌లో దీనిని విడుద‌ల చేశారు. రిలీజ్ అయిన నాటి నుంచి నేటి దాకా టాప్ మ్యూజిక్ చార్ట్స్ ల‌లో ఈ ఆల్బ‌మ్ నిలిచింది. చంద్రికా టాండ‌న్(Singer Chandrika) ఎవ‌రో కాదు ప్ర‌ముఖ దిగ్గ‌జ అమెరిక‌న్ కంపెనీ పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి సోద‌రి.

Singer Chandrika Tandon Won..

చంద్రికా టాండ‌న్ తో పాటు ఎరు మ‌ట్సు మోటో, వౌట‌ర్ కెల్లెర్ మూన్ తో క‌లిసి ఈ అవార్డును గెలుపొందారు. పుర‌స్కారం అందుకున్న అనంత‌రం చంద్రికా టాండ‌న్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌పంచాన్ని ఏకం చేసే శ‌క్తి కేవ‌లం సంగీతానికి మాత్ర‌మే ఉంటుంది. దానిని ఆస్వాదిస్తూ పోతే జీవితం మ‌రింత ఆనంద‌మ‌యం అవుతుంద‌న్నారు.

సంగీతానికి, ప్ర‌త్యేకించి అవార్డు కోసం ఎంపిక చేసిన జ్యూరీ స‌భ్యుల‌కు, నిర్వాహ‌కుల‌కు ప్ర‌త్యేకించి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇదిలా ఉండ‌గా అమెరికా మాజీ అధ్య‌క్షుడు జిమ్మీ కార్ట‌ర్ కు కూడా గ్రామీ అవార్డు ద‌క్కింది. ఆయ‌న త‌ర‌పున మ‌న‌వ‌డు అందుకున్నారు. త‌న జీవితంలో 3 సార్లు గ్రామీ పుర‌స్కారం అందుకున్నారు.

Also Read : Hero Prabhas : డార్లింగ్ ప్ర‌భాస్ డైరెక్ట‌ర్స్ హీరో

Chandrika TandonGrammy AwardsTrendingUpdates
Comments (0)
Add Comment