indian 2 Movie Teaser : భారత దేశ సినీ చరిత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 75 ఏళ్లవుతున్నా దేశానికి స్వతంత్రం వచ్చి ఇంకా కరప్షన్ పేరుకు పోతూనే ఉంది. దీనిని ప్రశ్నించే వాళ్లు రాను రాను కరువై పోతున్నారు.
indian 2 Movie Teaser Viral
నేరస్తులు, దగుల్బాజీలు, అక్రమార్కులు, ఆర్థిక నేరగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బ్యాంకులకు కన్నాలు వేసిన వాళ్లు దేశాన్ని దాటి వెళ్లి పోతున్నారు. మరికొందరు మన కళ్ల ముందే దర్జాగా తిరుగుతున్నారు.
రాజకీయ నాయకుల అవతారం ఎత్తుతూ చట్ట సభల్లో యధేశ్చగా దర్జాను వలక బోస్తున్నారు. దేశమంతటా ఆక్టోపస్ లా విస్తరించిన అవినీతిపై శంకర్ ఎక్కు పెట్టిన బాణం ఇండియన్. ఇందులో లోక నాయకుడు కమల్ హాసన్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత తిరిగి శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో మరోసారి ఇండియన్ కు సీక్వెల్ గా ఇండియన్ -2(Indian 2 Movie) వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. శంకర్ తనదైన మార్క్ ను కనబర్చాడు. ఇన్నేళ్లయినా మార్పు రాలేదు..కానీ కరప్షన్ మాత్రం కొత్త పుంతలు తొక్కుతోందంటూ చూపించే ప్రయత్నం చేశాడు.
ఇండియన్ కు రెహమాన్ మ్యూజిక్ అందిస్తే ఈ సీక్వెల్ మూవీకి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇక ఇండియన్ 2 మూవీ టీజర్ కు భారీ స్పందన వస్తోంది. అమీర్ ఖాన్ , మోహన్ లాల్, రజనీకాంత్ , తదితర సినీ నటులు కమల్ నటనకు, శంకర్ డైరెక్షన్ కు ఫిదా అవుతున్నారు.
Also Read : Mouni Roy : మౌని రాయ్ షోపై ఉత్కంఠ