Indian 2: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో భారతీయుడు 2). సమకాలీన సామాజిక సమస్య లంచం ఇతివృత్తంగా సరిగ్గా 27 ఏళ్ళ క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు)కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో కాజల్ కథానాయిక. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Indian 2….
జూలై 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. కొన్ని సూచనలు ఇస్తూ సెన్సార్ బోర్డు దీనికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘భారతీయుడు 2(Indian 2)’ రన్‌టైమ్ ఏకంగా 3.04 గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించిన పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డ్ చిత్రబృందాన్ని సూచించినట్లు సమాచారం. ఇంత నిడివి ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందుకు తగిన కథ, కథనాలు ఉండాలి. అయితే శంకర్ ఈ విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దీని గురించి ఆయన ఇటీవల మాట్లాడుతూ అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు.
ఇటీవల వచ్చిన ‘యానిమల్’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు మూడు గంటలకు పైగా రన్ టైమ్‌తో విడుదలయ్యాయి. ఇప్పుడు వీటి జాబితాలో కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ చేరింది. ఆ సినిమాలన్నీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పటికే ‘భారతీయుడు 2’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధించడం ఖాయమని సినీప్రియులు అభిప్రాయపడుతున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ డబుల్ యాక్షన్ లో 1996లో నిర్మించిన భారతీయుడు సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఓ సన్సేషన్. స్వాతంత్ర సమరయోధుడిగా, అవినీతిని అన్యాయాన్ని వ్యతిరేకించే భారతీయుడిగా కమల్ హాసన్ నటన అద్భుతం. ఇక ఈ సినిమాతో శంకర్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనీషా కొయిరాల అందాలు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్. వీరశేఖరన్ సేనాపతి గా కమల్ హాసన్ పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల గుండెల్లో నేటికీ చెదరని ముద్ర వేసింది. అందుకే ఇప్పుడీ వీరశేఖరన్ సేనాపతిని ఇండియన్-2(Indian 2) (తెలుగులో భారతీయుడు-2) గా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నదాడు దర్శకుడు శంకర్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అదేవిదంగా రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Also Read : Sonu Sood: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించిన సోనూసూద్ !