IND Vs NZ : ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025). దుబాయ్ వేదికగా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం అసలైన పోరాటం ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బలమైన న్యూజిలాండ్ జట్టుతో పోటీ పడేందుకు సిద్దమైంది. ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ బలంగా ఉంది.
IND Vs NZ Champions Trophy 2025 Final
ఎలాగైనా సరే కీవీస్ ను ఓడించి, విశ్వ విజేతగా నిలవాలని కంకణం కట్టుకుంది టీమిండియా. కోట్లాది మంది భారతీయులు ఇవాళ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దేవాలయాలలో భారత్ గెలవాలని క్రికెట్ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. 25 ఏళ్ల అనంతరం భారత , న్యూజిలాండ్ జట్లు ఫైనల్ లో తలపడుతుండడం విశేషం. ఇరు జట్లు బలంగా ఉన్నప్పటికీ ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో తప్ప అన్ని మ్యాచ్ లలో గెలుపొందింది. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కీవీస్ చేతిలో భారత్ 4 వికెట్ల తేడాలో ఓటమి పాలైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కీలక పోరు ప్రారంభం కానుంది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం . ఇప్పటికే దుబాయ్ లో మ్యాచ్ వీక్షించేందుకు టికెట్లు అమ్ముడు పోయాయి. ఎవరు గెలుస్తారనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ కొనసాగుతోంది.
Also Read : Popular Actress Sridevi :చిరస్మరణీయం శ్రీదేవి జ్ఞాపకం