Alekya Tarakaratna : తారకరత్న భార్య పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు

ఎవరి పిల్లలైనా సరే.. వారి స్థాయిని, బ్యాక్ గ్రౌండ్‌ను చూడకుండా....

Alekya Tarakaratna : తారకరత్న మరణానంతరం తన పిల్లలే లోకంగా బతికేస్తోంది అతని భార్య అలేఖ్య. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన భర్త, పిల్లల గురించి ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తోంది. తద్వారా తన ఆవేదన, ఎమోషన్స్ ను అందరితో షేర్ చేసుకుంటోంది. అలాగే తరచూ తన ఫాలోవర్లతో క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహిస్తుంటుంది. అందులో అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా, సరదాగా సమాధానాలిస్తుంటుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ తారకరత్న భార్య, పిల్లలపై నోరు పారేసుకున్నాడు. ‘ ఇంత మందిని కనడం ఎందుకు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా ఇలాంటి మాటలు వింటే ఎవరికైనా కోపం నషాలానికి అంటుతుంది. కానీ అలేఖ్య(Alekya Tarakaratna) మాత్రం సుతి మెత్తంగా మాట్లాడింది. ‘ దయచేసి ఇలాంటి ద్వేషం వద్దు.. అందరికీ ప్రేమను పంచండి’ అంటూ నెటిజన్లను వేడుకుంది.

Alekya Tarakaratna Emotional..

‘ఎవరి పిల్లలైనా సరే.. వారి స్థాయిని, బ్యాక్ గ్రౌండ్‌ను చూడకుండా.. అందరినీ సమానంగా చూడాలి.. ప్రేమించాలి.. పిల్లలకు ప్రేమను పంచాలి. పిల్లలపై ద్వేషాన్ని చూపించకుండా.. వారికి హాని చేయాలని అనుకోకూడదు. నెగెటివిటీ, ద్వేషం కంటే.. అర్థం చేసుకునే గుణం, ప్రేమను పంచే తత్వాన్ని ఈ సమాజంలో పెంచాలి. మనమంతా కలిసి పాజిటివ్‌గా ఆలోచిస్తే అలాంటి అద్భుతమైన సమాజాన్ని నిర్మించొచ్చు. దయచేసి మీరంతా ప్రేమను పంచండి’ అంటూ నెటిజన్లను వేడుకుంది అలేఖ్య. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. చాలా మంది నెటిజన్లు అలేఖ్యకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నెటిజన్ పై మండి పడుతున్నారు. కాగా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో అతనిని బెంగళూరు హాస్పిటల్‌కు తరలించి.. అక్కడ మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు, అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు తారకరత్న.

Also Read : Sayaji Shinde Meet : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన నటుడు షిండే

AlekyaEmotionalTarakaratnaUpdatesViral
Comments (0)
Add Comment