Jai Hanuman : ‘జై హనుమాన్’ లో హనుమాన్ పాత్రకు ఆ పాన్ ఇండియా స్టార్

ఇంతకీ ఆ హీరో ఎవరంటే..తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’...

Jai Hanuman : దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ‘హనుమాన్’ సినిమా విజయంతో ఒక్కసారిగా మారుమోగింది. అతను తదుపరి సినిమా కూడా ‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్(Jai Hanuman)’ తీస్తున్నట్టు ప్రకటించారు. అందులో అగ్రనటులు నటిస్తున్నారని వార్తలు బాగా వ్యాప్తి చెందిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. మరోవైపు చిరంజీవి, రామ్‌చరణ్, రానా దగ్గుబాటి‌లలో ఎవరైనా ఒకరు హనుమంతుడి క్యారెక్టర్ చేయనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అవన్నీ కేవలం పుకార్లే అని తేలింది. తాజాగా హనుమంతుడి రోల్ కోసం ఒక పాన్ ఇండియన్ స్టార్‌ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖరారు చేసినట్లు సమాచారం.

Jai Hanuman Movie Updates

ఇంతకీ ఆ హీరో ఎవరంటే..తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌(Hanuman)’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కోట్లు కలెక్షన్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థ్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. కాంతారా సినిమాతో జాతీయ గుర్తింపు పొందిన హీరో రిషబ్ శెట్టి. దైవ భక్తి మెండుగా ఉండే ఈ హీరోకి ప్రశాంత్ ‘జై హనుమాన్(Jai Hanuman)’ స్టోరీ నేరేట్ చేసినట్లు సమాచారం. కథ నచ్చిన రిషబ్ హనుమాన్ రోల్ చేయడానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాగా హనుమాన్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రైమ్ షో కాకుండా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుండటం విశేషం.

కన్నడ సినిమా ప్రైడ్ గా తెరకెక్కిన ‘కాంతారా’ జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇండియన్ వైడ్ గా క్రేజి హిట్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ‘కాంతారా చాప్తర్ 1’ గా ప్రీక్వెల్ సిద్ధం సిద్దమవుతుంది. భారీ గ్రాఫిక్స్‌ హంగులతో ఈ చిత్రం ముస్తాబు కానుందని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు యూఎస్‌, యూకేల్లో జరుగుతున్నట్లు శాండల్‌వుడ్‌ మీడియా చెబుతోంది. ఈ సినిమా ప్రస్తుతం కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం రిషబ్‌ ఇప్పటికే కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నారు. వచ్చే ఏడాది దక్షిణాది భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Also Read : SSRMB Movie : మహేష్, రాజమౌళి సినిమాపై మరో అప్డేట్

CinemaJai HanumanTrendingUpdatesViral
Comments (0)
Add Comment