Illayaraja : తెలుగు సినిమా చరిత్రలో అరుదైన సన్నివేశానికి వేదికైంది ఓ చిత్రం. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి తొలిసారిగా షష్టిపూర్తి(Shastipoorthi) చిత్రానికి పాట రాశారు. దీనికి సంగీతం అందించారు మ్యాస్ట్రో ఇళయరాజా. ఈ ఇద్దరు చేసిన పాటను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ పాట పేరు ఏదో ఏ జన్మలోదో అని. రూపేష్ హీరోగా మా అయి ప్రొడక్షన్స్ సంస్థ ‘షష్టిపూర్తి’ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Shastipoorthi Movie Song-Illayaraja
ఇందులో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ ప్రభ ఈ చిత్రానికి దర్శకుడు. ఏరికోరి ఇళయరాజా(Illayaraja)ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు . ఆయన సంగీత స్వర కల్పనలో కీరవాణి పాట రాయడం విశేషం. ఇద్దరు దిగ్గజ సంగీతకారులు స్వర పరిచిన పాటను దేవిశ్రీ రిలీజ్ చేయడం సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడారు.పాటల రికార్డింగ్ కోసం ఇళయరాజా గారి దగ్గరికి చెన్నై వెళ్ళాం. ఇందులో రెహమాన్, చైతన్య ప్రసాద్ పాటలు రాశాడు. కీరవాణి అయితే బాగుంటుందని అనుకున్నా.
వెంటనే అందుకు ఒప్పేసుకున్నారు. ఈ విషయాన్ని గురువు ఇళయరాజాకు చెప్పాను. దానిని చైతన్య ప్రసాద్ చెవిలో ఊదాను. ఇంకేమీ ఆలోచించకుండా కీరవాణిని సంప్రదించాం. ఆయన ఇంకో మూవీ కోసం ఇక్కడే చెన్నైలోనే ఉన్నారు. రాజాకు చెప్పారా అని అడిగారు. మీరే చెప్పాలంటూ బతిమాలాను. చివరకు పాటను అద్భుతంగా రాశారు కీరవాణి. దీనిని అనన్య భట్ అద్భుతంగా పాడారంటూ కితాబు ఇచ్చారు డైరెక్టర్.
రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా, ‘కాంతారావు’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకీ’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీన, అనిల్, కె.ఎ. పాల రాము, మహి. అప్పాజీ , ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : Beauty Tamannaah-Odela 2 :మిల్కీ బ్యూటీ మూవీ ఓదెల2 డేట్ ఫిక్స్